Unni Mukundan | మేనేజర్‌పై దాడి.. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌పై కేసు నమోదు.!
Unni Mukundan | మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశాడంటూ.. అతడి మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Unni Mukundan | మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశాడంటూ.. అతడి మాజీ మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విపిన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తాను టొవినో థామస్ నటించిన తాజా చిత్రం ‘నరివెట్టా’ గురించి సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టడంతో ఉన్ని ముకుందన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం.
ఉన్ని ముకుందన్ తనను తన ఫ్లాట్ కింద ఉన్న పార్కింగ్ ఏరియాకు పిలిపించి, తీవ్రమైన పదజాలంతో దూషించాడని, ఆ తర్వాత తనపై దాడి చేశాడని విపిన్ ఆరోపించాడు. ఈ దాడిలో తన ఇంటి అద్దాలు కూడా పగలగొట్టారని విపిన్ పోలీసులకు తెలిపాడు. గాయపడిన విపిన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను ఆరు సంవత్సరాలుగా ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్‌గా పనిచేశానని, ప్రస్తుతం పరిశ్రమలో 18 ఏళ్లుగా ఉన్నానని విపిన్ పేర్కొన్నాడు.
ఉన్ని ముకుందన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో లైంగిక వేధింపుల కేసు, యూట్యూబర్, సీక్రెట్ ఏజెంట్‌పై బెదిరింపుల కేసులలో కూడా అతను ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ తాజా ఆరోపణలపై ఉన్ని ముకుందన్ లేదా అతని పీఆర్ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు విపిన్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

