Uma Devi: బిగ్ బాస్ హౌజ్ నుండి రెండో కంటెస్టెంట్ ఔట్.. కుండలు పగలగొట్టి నిజాలు చెప్పిన ఉమా

బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించి సండే ఎపిసోడ్లో టాస్క్‌లు అన్నీ పూర్తయ్యాక గార్డెన్ ఏరియాలోకి నటరాజ్ మాస్టర్, ఉమా దేవీలను పిలిచాడు నాగార్జున. ఎవరి గన్ అయితే పేలుతుందో వారు సేవ్ అని చెప్పాడు. దీంతో నటరాజ్ గన్ను పేలింది. ఆయన సేఫ్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. ఉమా దేవీ ఎలిమినేట్ అయినట్టు నాగ్ అనౌన్స్ చేశాడు. దీంతో నటరాజ్ మాస్టర్ మాత్రం వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
భార్యను ఇలాంటి సమయంలో వదిలేసి వచ్చాను.. ఏదో ఒకటి సాధించి వెళ్లాలని అనుకున్నాను అంటూ నటరాజ్ మాస్టర్ భోరున ఏడ్చేశాడు. ఉమాదేవికి హౌజ్‌మేట్స్ సెండాఫ్ ఇవ్వగా, ఆమె స్టేజ్‌పైకి వచ్చి అందరికి పలు సూచనలు చేసింది. కంటెస్టెంట్ల బొమ్మలున్న కుండలు బద్దలు కొట్టి ఉమా దేవీ తన అభిప్రాయాలను చెప్పేసింది.
సిరి గురించి మాట్లాడుతూ.. ఎవరి ఆట వారు ఆడండి.షన్నూది ఆడకు అని చెప్పింది. లహరి ఎవరి సాయం తీసుకోకుండా సింగిల్‌గా ఆడే ప్రయత్నం చేయి. ప్రియ సేఫ్ గేమ్ ఆడుతుందని పేర్కొంది. షన్ను బేటా అంటూ నీ గేమ్ నువ్ ఆడుకో అంటూ సలహా ఇచ్చింది. సిరి నీకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. నీ ఆట నువ్ ఆడు అని షన్నుకు ఉమా దేవీ చెప్పింది.
అల్లుడు అంటూ రవికి చురకలు అంటించింది. అందరినీ దగ్గర తీసుకునే క్రమంలో మిగతా వారికి దూరం అవుతున్నావేమో అని ఉమ చెప్పింది.ఇక లోబో గురించి మాట్లాడుతూ..మా గురించి ఎన్నో అనుకొని ఉంటారు. మాది ఫ్రెండ్షిప్ మాత్రమే. స్వీట్ హార్ట్ అని అందరు అంటారు, లోపల నుండి మాత్రం ఎవరు అనరు చెప్పుకొచ్చింది.మీ గేమ్ మీరు ఆడండి..అమ్మా, అక్కా, చెల్లి అని మాత్రం చూడకండి అని ఆనీ మాస్టర్‌కు ఉమా సలహా ఇచ్చింది.
నటరాజ్ మాస్టర్ కుండ చివరిగా పగలగొట్టి.. మీరేంటనేది అందరికి తెలుసు. ఆటని ఆటలా ఆడాలని అన్నారు.. అలానే ఆడండి.. అప్పుడు మీరు వేరే లెవెల్లో ఉంటారు అని నటరాజ్ మాస్టర్‌కు ఉమ సలహా ఇచ్చింది. ఇక రవి బర్త్ డే కావడంతో అతనికి సర్ప్రైజ్ వచ్చింది. తన భార్య పంపిన లెటర్ చదివి ఎమోషనల్ అయ్యాడు. అలాగే తనకు గిఫ్ట్ ఇచ్చిన ఉంగరాన్ని ముద్దు పెట్టుకొని ఫుల్ ఖుష్ అయ్యాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

