Kaikala satyanarayana | ఆశ్రునయనాల మధ్య ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు..!
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసాయి. ఫిలింనగర్లోని కైకాల నివాసం నుండి మహాప్రస్థానం వరకు ఆయన పార్థీవ దేహానికి అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
Kaikala satyanarayana Last Rites | సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసాయి. ఫిలింనగర్లోని కైకాల నివాసం నుండి మహాప్రస్థానం వరకు ఆయన పార్థీవ దేహానికి అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కైకాల పెద్ద కొడుకు రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గొప్ప నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కైకాల కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల.. శుక్రవారం తెల్లవారు జామున ఫిలింనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. నటులు పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్, రాధ వంటి పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

