Tiger Shroff | భవిష్యత్తులోకి తీసుకెళ్లబోతున్న టైగర్ ష్రాఫ్.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న గణపథ్ టీజర్..!
Tiger Shroff | ఈ సారి దసరా పండగను టైగర్ ష్రాఫ్ కూడా లాక్ చేసుకున్నాడు. అమితాబ్‌తో కలిసి చేసిన గణపథ్ సినిమాను తెలుగులోను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా తాలూకూ టీజర్‌ను రిలీజ్ చేశారు.
Tiger Shroff | ఈ సారి దసరా పండగను టైగర్ ష్రాఫ్ కూడా లాక్ చేసుకున్నాడు. అమితాబ్‌తో కలిసి చేసిన గణపథ్ సినిమాను తెలుగులోను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా తాలూకూ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు ఓ క్లారిటీ ఇచ్చేశారు. టీజర్ స్టార్టింగ్‌లోనే 2070 అంటూ భవిష్యత్తులోకి తీసుకెళ్లిపోయారు. ధ్యానంలో మునిగిపోయిన టైగర్ ష్రాఫ్‌ను చూపించి ఆ తర్వాత ఆకాశాన్నంటే భవనాలు, నిజంగా ఫ్యూచర్ ఇలానే ఉంటుందా అన్న రేంజ్లో విజువల్స్ ఆసక్తిని రేకెత్తించాయి. మిలిటరి డ్రెస్సులు వేసుకున్న ఓ మూక.. జనాలను వేధిస్తుండగా..వారిని రక్షించేందుకు వీరుడిలా టైగర్ ష్రాఫ్ వస్తాడు. ఆ మూక చేతిలో బలవుతున్న ప్రజలను కాపాడే బాధ్యతను తీసుకుని పోరాటాలు చేస్తాడు.
మరో 50ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సబ్జెక్ట్‌కు యాక్సన్‌ను పుష్కలంగా జోడించినట్లు టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. అమితాబ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. నేషనల్ అవార్డు హీరోయిన్ కృతి సనన్ సైతం పోరాటలతో అదరగొడుతుంది. టీజర్ చివర్లో గణపతి షాట్ మాత్రం వేరే లెవల్. టీజర్ మొత్తంగా కాస్త ఆసక్తి రేకెత్తించేలానే కనిపిస్తుంది. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 20న హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. అదే రోజున టైగర్ నాగేశ్వరరావు.. ముందు రోజున భగవంత్ కేసరి, లియో సినిమాలు రిలీజవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

