Vettayan | వేట్టయాన్ యాక్షన్ హంగామా.. రజనీకాంత్ డైలాగ్స్ హైలైట్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్-ది హంటర్' ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు.
Vettayan | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్-ది హంటర్’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా సందర్భంగా ఈ నెల 10 ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ అంశాలతో సాగింది. ‘క్రైమ్ క్యాన్సర్‌లాంటిది. దానిని పెరగనివ్వకూడదు’ ‘నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్ వాడినే సార్. నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్లా కాదు’ అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి.
ట్రైలర్లో అమితాబ్‌బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ పాత్రలను పరిచయం చేసిన తీరు, వారు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రజనీకాంత్ తనదైన ైస్టెల్, మేనరిజమ్స్‌తో మెప్పించారు. పోలీస్ వ్యవస్థకు, సంఘ విద్రోహక శక్తులకు మధ్య జరిగే పోరు నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతున్నది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

