Tollywood Shooting | షూటింగ్‌లు ఆపేయండి.. నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు
Telugu Film Chamber | టాలీవుడ్లో సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది.
TFCC | టాలీవుడ్లో సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌లను ఎక్కడికక్కడ నిలిపివేయాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. సినిమా కార్మికుల వేతనాల పెంపు వివాదంకి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో నిర్మాతలను షూటింగ్‌లు ఆపివేయాలంటూ ఛాంబర్ పిలుపునిచ్చింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకూ ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని తెలిపింది.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, కార్మికుల వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4, 2025 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను నిర్మాతల సంఘం అంగీకరించకపోవడంతో, షూటింగ్‌లను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. అయితే దీనిపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండించింది. చిన్న నిర్మాతలు ఈ వేతన పెంపును భరించలేరని, ఇది పరిశ్రమకు మరింత నష్టం కలిగిస్తుందని ఛాంబర్ అభిప్రాయపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతునే ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

