HBD Vishwak Sen | యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న క్రేజీ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) నుంచి చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. “తమ మ్యాన్ ఆఫ్ షేడ్స్ అయిన విశ్వక్ సేన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని మరోసారి ‘బ్రిలియంట్’ (Brilliant) అనిపించడానికి ఆయన మళ్లీ వస్తున్నారు” అంటూ చిత్ర బృందం పేర్కొంది. గతంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ ఎంతటి పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందులోని ‘వివేక్’ పాత్రలో విశ్వక్ సేన్ నటనకు, ముఖ్యంగా ‘బ్రిలియంట్’ అనే డైలాగ్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ఈ గ్యాంగ్ మళ్లీ సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది.
Team #ENERepeat wishes their man of shades @VishwakSenActor a very Happy Birthday 💥💥
He’s back to make you say BRILLIANT again 🤩#HBDVishwakSen#TharunBhascker @AbhinavGomatam @maganti_srinath #VenkateshKakumanu #VivekSagar #AjAaron #RaviTejaGirijala @SOriginals1… pic.twitter.com/523nsKXfZC
— Vamsi Kaka (@vamsikaka) March 29, 2026