మర్డర్ మిస్టరీ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘తత్వం’. దినేష్‌తేజ్, దష్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ కోల దర్శకుడు. వంశీ చీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మాతలు. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదని, మన చుట్టూ జరుగుతున్న సంఘటనల స్ఫూర్తితో కథ తయారుచేసుకున్నానని, వంశీ ‘అన్వేషణ’ తరహాలో ఆకట్టుకుంటుందని దర్శకుడు అర్జున్ కోలా తెలిపారు.
ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్లా నిలుస్తుందనే నమ్మకం ఉందని, కథలోని మలుపులు సర్ప్రైజింగ్గా ఉంటాయని హీరో దినేష్‌తేజ్ పేర్కొన్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇదని నిర్మాత వంశీ సీమకుర్తి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: భరత్ పట్టి, సంగీతం: చేతన్ భరద్వాజ్, దర్శకత్వం: అర్జున్ కోల.