Tamannaah | అవి చిన్న సినిమాలా? పెద్ద సినిమాలా? ఇక్కడ హిట్ అవ్వడం ముఖ్యం: తమన్నా
ఓవైపు సినిమాలు, మరోవైపు సిరీస్‌తో బిజీగా ఉన్నారు అందాలభామ తమన్నా. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాకు.. ‘ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా?’ అనే ప్రశ్న ఎదురైంది. తమన్నా మాట్లాడుతూ ‘నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు.
Tamannaah | ఓవైపు సినిమాలు, మరోవైపు సిరీస్‌తో బిజీగా ఉన్నారు అందాలభామ తమన్నా. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాకు.. ‘ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా?’ అనే ప్రశ్న ఎదురైంది. తమన్నా మాట్లాడుతూ ‘నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ తక్కువ బడ్జెట్ సినిమా కంటెంట్ బావుండి హిట్ అయితే.. అదే పెద్ద సినిమా. ఓ భారీ బడ్జెట్ సినిమా కంటెంట్ బాగుండక ఫ్లాప్ అయితే.. అది ఆటోమేటిగ్గా చిన్న సినిమా అయిపోతుంది.
కెరీర్ తొలినాళ్లలో ‘హ్యాపీడేస్’ చేశా. అందులో ఎనిమిదిమంది ప్రధానపాత్రధారుల్లో నేనూ ఒకదాన్ని. ఆ సినిమా మీ దృష్టిలో చిన్న సినిమానా? పెద్ద సినిమానా? ఆ సినిమా బడ్జెంట్ ఎంత? రాబట్టింది ఎంత? రీసెంట్గా ‘స్త్రీ 2’లో ప్రత్యేక గీతంలో నర్తించా. నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టే చేశా. నిజానికి ఆ సినిమాలో హీరోనే లేడు. కానీ 900కోట్లు వసూలు చేసింది. అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? ఇక్కడ హిట్ అవ్వడం ముఖ్యం.’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

