రుహాని శర్మ ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘హర్’. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకుడు. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లేడీ ఓరియెంటెడ్ కథ ఇది.
పోలీస్ ఇన్వ్‌స్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. జూలై 21న ఈ చిత్రాన్ని సురేష్ మూవీస్ ద్వారా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం’ అన్నారు.