సన్నీలియోన్ మంచి మనసు
సాటి మనిషికి మనం చేసే సాయమే భూమ్మీద బతుకుతున్నందుకు భగవంతుడికి మనం కట్టే అద్దె. ఈ విషయం నటి సన్నీలియోన్‌కి బాగా తెలుసు.
సాటి మనిషికి మనం చేసే సాయమే భూమ్మీద బతుకుతున్నందుకు భగవంతుడికి మనం కట్టే అద్దె. ఈ విషయం నటి సన్నీలియోన్‌కి బాగా తెలుసు. అనాధ పిల్లల్ని పెంచుకోవడం.. పేద పిల్లలకు తన ఫౌండేషన్ ద్వారా విద్యాదానం చేయడం.. అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఎవరి పిల్లలైనా సరే, సెట్లో ఉండటానికి వీల్లేదని దర్శక,నిర్మాతలకే ఆమె ఆంక్షలు విధించడం.. ఇలా చెప్పుకుంటూపోతే సన్నీ గొప్ప మనసు చాలా సందర్భాల్లో బహిర్గతం అవుతూనేవుంది. రీసెంట్గా మరోమారు తన గొప్ప మనసును చాటుకుందామె. తన ఇంటి పనిమనిషి కుమార్తె ఇటీవల ముంబయ్‌లో తప్పిపోయింది.
ఆ అమ్మాయిపేరు అనుష్క. ఆ పాప వివరాలన్నీ పొందుపరుస్తూ, ‘ఆ తల్లిదండ్రుల వేదనను చూడలేకపోతున్నా. ఆ పాపని వెతికి తెచ్చినవారికి 50వేల రూపాయలు పారితోషికం ఇస్తా’ అంటూ తన ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టింది సన్నీలియోన్. అంతేకాక, ఆ పోస్ట్‌ని ముంబయ్ పోలీస్ కమీషనర్‌కు ట్యాగ్ కూడా చేసింది. ఈ పోస్ట్ పెట్టిన ఇరవైనాలుగు గంటల్లో ముంబయి పోలీసులు ఆ పాపను ట్రేస్ చేసి పట్టుకున్నారు. పాప దొరకగానే, ‘పాప దొరికింది.
మన ప్రార్థనలకు సమాధానం కూడా దొరికింది. ఆ కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. సహకరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ ఆనందంతో మరో పోస్ట్ పెట్టింది సన్నీ. పనిమనిషి బిడ్డ గురించి కూడా ఇంతగా ఆరాటపడటం సన్నీలియోన్ మంచి మనసుకు నిదర్శనం అంటూ నెటిజన్స్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

