ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న పిల్లల సినిమా ‘సమ్మర్ హాలీడేస్’. మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకుడు. త్వరలోనే సినిమా విడుదల కానున్నది. మ్యూజిక్ ప్రమోషన్లో భాగంగా సినిమాలోని రెండో పాట అయిన ‘స్కూల్ సాంగ్’ని ఈ నెల 29న మేకర్స్ విడుదల చేయనున్నారు.
వేసవి సెలవులు పూర్తయ్యాక తిరిగి పిల్లలు స్కూల్కు వెళ్లేటప్పుడు చేసే సందడంతా ఈ పాటలో ఉంటుందని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అందమైన కథతో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, వర్షణి, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాశ్, సంగీతం: సింజిత్ యెర్రమల్లి, నిర్మాణం: ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్.