కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘కోటిగొబ్బ-3’. ఈ సినిమాను ‘K3 కోటికొక్కడు’ పేరుతో గుడ్ఫ్రెండ్స్, దేవేందర్ డీకే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శివకార్తిక్ దర్శకుడు. సుదీప్ ఫస్ట్‌లుక్‌ను దర్శకత్రయం మారుతి, బాబీ, గోపీచంద్ మలినేని సంయుక్తంగా విడుదలచేశారు. ఈ పోస్టర్లో డాలర్స్ మధ్య నడుచుకుంటూ వస్తూ సుదీప్ కనిపిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరున సినిమాను విడుదలచేస్తామని నిర్మాతలు తెలిపారు.