సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణని చిత్రసీమకు పరిచయం చేస్తూ అజయ్‌భూపతి తెరెక్కిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కథానాయిక. డా.మోహన్‌బాబు పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. పి.కిరణ్ ఈ చిత్రానికి నిర్మాత. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పకుడు. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కానున్నది. తన మార్క్ ఇంటెన్సిటీతో అందమైన ప్రేమకథగా దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇందులో పవర్ఫుల్ యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని, జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంట యూత్‌ని ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ISC, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: చందమామ కథలు.