వద్దనడం తెలియదు
చిత్ర పరిశ్రమలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియదు. ఎప్పుడు వెల్లువలా అవకాశాలు వచ్చిపడతాయో ఊహించలేం. అలా తెలుగు తెరపైకి కెరటంలా దూసుకొచ్చింది అందాల తార శ్రీలీల. ‘ధమాకా’ హిట్ తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఇప్పుడు టాలీవుడ్లో ఏ క్రేజీ మూవీ చూసినా నాయికగా శ్రీలీల పేరే వినిపిస్తున్నది.
చిత్ర పరిశ్రమలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియదు. ఎప్పుడు వెల్లువలా అవకాశాలు వచ్చిపడతాయో ఊహించలేం. అలా తెలుగు తెరపైకి కెరటంలా దూసుకొచ్చింది అందాల తార శ్రీలీల. ‘ధమాకా’ హిట్ తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఇప్పుడు టాలీవుడ్లో ఏ క్రేజీ మూవీ చూసినా నాయికగా శ్రీలీల పేరే వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆమె ఖాతాలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, మహేష్ బాబు 28, రామ్, బోయపాటి సినిమా, బాలకృష్ణ 108, నితిన్ కొత్త సినిమా, వీడీ 12, నవీన్ పోలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’ సినిమాల్లో నటిస్తున్నది శ్రీలీల.
ఈ వరుస ప్రాజెక్టులతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేని పరిస్థితిలో పడిందట ఈ భామ. డేట్స్ ఖాళీ లేక, అందివచ్చిన అవకాశాలు వదులుకోలేక ఇబ్బందులు పడుతున్నదీ యువ నాయిక. అయితే తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాను అంగీకరిస్తూ, ఏ ప్రాజెక్ట్‌నూ నిరాకరించడం లేదు శ్రీలీల. అసాధ్యమైతే తప్ప వీలైనంత వరకు నటిస్తూనే ఉండాలనే తపన శ్రీలీలలో కనిపిస్తున్నది అంటున్నారు పరిశ్రమ వాసులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

