Sri-Kala-Hasti Song | కన్నప్ప నుంచి ‘శ్రీకాళహస్తి’ ఫుల్ సాంగ్ విడుదల
Kannappa | టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కన్నప్ప' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Kannappa | టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే సినిమాలోని ఒక ప్రత్యేక భక్తి గీతాన్ని తాజాగా విడుదల చేశారు మేకర్స్.
‘కన్నప్ప’ చిత్రం నుండి “శ్రీకాళహస్తి” అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ భక్తి గీతానికి ఒక ప్రత్యేక ఆకర్షణ తోడైంది. మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటను ఆలపించారు. వారి గాత్రం ఈ పాటకు మరింత ఆధ్యాత్మికతను జోడించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్టీఫెన్ దేవస్సీ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆధ్యాత్మిక గీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మంచు మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో తెరకెెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

