Sree Vishnu | ‘అల్లూరి’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్.. మొదటి సారిగా పోలీస్ పాత్రలో శ్రీవిష్ణు
Alluri First Look Poster | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేయడంలో శ్రీ విష్ణూ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘భళా తందనాన’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘అల్లూరి’ అనే మాస్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్‌లుక్ విడుదలైంది.
లేటెస్ట్గా విడులైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో శ్రీవిష్ణు పోలీస్ గెటప్‌లో చేతిలో గన్ పట్టుకుని ఇంటెన్సీవ్‌గా చూస్తున్నాడు. ఇప్పటివరకు శ్రీ విష్ణు పోలీస్ పాత్రలో నటించలేడు. మొదటి సారిగా పోలీస్ రోల్లో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణూ ఎప్పటిలాగానే ఈ సారి కూడా విభిన్న కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. కాగా ఈసారి కమర్షియల్ హంగులను కూడా జోడించాడు.
నిజాయితీకి మారుపేరు ..
అల్లూరి ! 👮🏻♂️🔥Here's the Powerful First Look of @sreevishnuoffl's #𝗔𝗟𝗟𝗨𝗥𝗜 💥#AlluriFirstLook 🚨
Directed by #PradeepVarma 🎬@rameemusic #RajThota @luckymediaoff @BekkemVenugopal #Babita pic.twitter.com/2vkYwauOjM— LuckyMedia (@luckymediaoff) July 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

