Spy Movie | స్పై మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్.. దేశభక్తి ఉప్పొంగించేలా ఉంది..!
Spy Movie Second Single | నిఖిల్ జోరు చూస్తుంటే రానున్న రెండు మూడేళ్లలో ఆయన రేంజే మారిపోయేలా కనిపిస్తుంది. దానికి ఆయన ఎంచుకుంటున్న కథలే నిదర్శనం. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా పలు జానర్లను టచ్ చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు.
Spy Movie Second Single | నిఖిల్ జోరు చూస్తుంటే రానున్న రెండు మూడేళ్లలో ఆయన రేంజే మారిపోయేలా కనిపిస్తుంది. దానికి ఆయన ఎంచుకుంటున్న కథలే నిదర్శనం. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా పలు జానర్లను టచ్ చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సబ్జెక్ట్లే. ప్రేక్షకులు సైతం నిఖిల్ సినిమా వస్తుందంటే మంచి పాజిటీవ్ బజ్‌తో ఉంటారు. ఇక కార్తికేయ-2తో నార్త్‌లోనూ నిఖిల్‌కు మంచి పాపులారిటీయే వచ్చింది. దాంతో దర్శక, నిర్మాతలు నిఖిల్‌తో సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉండాలని.. అలాంటి కథలనే సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ లైనప్‌లో మెస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో స్పై ఒకటి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ నెల రోజుల క్రితం విడులైన టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతన్న ఈ సినిమా జూన్ 29న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని అజాది అనే సాంగ్ విడుదలైంది. సుభాష్ చంద్రబోస్ నినాదాలతో ఈ అజాదీ సాంగ్ దేశభక్తిని ఉప్పొంగించేలా ఉంది. కాలభైరవ ఆలపించిన ఈ పాట గూస్బంప్స్ తెప్పిస్తుంది. శ్రీచరణ్ పాకాల స్వర పరిచిన ఈ పాటకు కృష్ణ చైతన్య సాహిత్యం అందించాడు. ఇప్పటికే విడుదలైన జూమ్, జూమ్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
1945లో ప్లయిన్ క్రాష్ లో అంతర్ధానమైన సుభాష్ చంద్ర బోస్ మిస్టరీ మరణం చుట్టూ ఈ సినిమా తిరుగుతందని టీజర్, ట్రైలర్‌తోనే స్పష్టం అయింది. ఇదే కథకు వీర లెవల్లో హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ను గట్టిగా దట్టించాడు దర్శకుడు గ్యారీ నిజానికి ఇలాంటి మిస్టరీ స్టోరీలకు ఇప్పుడు తెగ క్రేజ్ ఉంది. తవ్వకాల్లో బయట పడే నిధుల గురించి ఏ మేర ఆసక్తి ఉందో.. ఇలా మరుగున పడిపోయిన, జనాలకు తెలియని కథలను సినిమా రూపంలో తెరకెక్కించి ఆదే ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా రేంజే పెరిగిపోతుంది. టీజర్, ట్రైలర్లను చూస్తే అలాంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

