Sourav Ganguly Biopic | గంగూలీ బయోపిక్‌లో రాజ్ కుమార్ రావు.. దాదా ఏమన్నాడు అంటే.!
Raj Kumar rao Ganguly Biopic | భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుంది.
Sourav Ganguly | టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Saurav Ganguly) జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో దాదా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఇదే విషయంపై గంగూలీ స్పందించాడు.
”నేను విన్నంతవరకు నా బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు(Raj Kumar rao) నటించబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఇది ప్రకటించిన అనంతరం తెరపైకి రావడానికి కనీసం సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుందంటూ” గంగూలీ చెప్పుకోచ్చాడు.
మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రాజ్ కుమార్ రావుని సంప్రదించగా.. అతడు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెరకెక్కించనుండగా.. విక్రమాదిత్య మొత్వానీ(Vikramadiya motwane) దర్శకత్వం వహించనున్నాడు. మరోవైపు ఇప్పటికే పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బయోపిక్‌లో నటించిన రాజ్ కుమార్ రావు దాదా బయోపిక్‌లో నటిస్తే ఎలా ఉంటాడో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
గంగూలీ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. భారత్ తరపున అతడు 113 టెస్టులు మరియు 311 వన్డేలు ఆడాడు. లెప్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన గంగూలీ అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశాడు. 2008లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడిగా.. తరువాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

