Don Movie | తెలుగులో వరుసగా రెండో హిట్ అందుకున్న శివకార్తికేయన్.. ‘డాన్’ క్లోజింగ్ కలెక్షన్స్
Don Movie Collections | తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన కార్తికేయన్ గతేడాది విడుదలైన ‘డాక్టర్’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈయన నటించిన ‘డాన్’ తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైంది. సిబి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంపై మొదట్లో ఎలాంటి అంచనాలు లేవు. నిజానికి చాలా మందికి అప్పుడు సినిమా విడుదలైన విషయమే తెలియదు. ఎందుకంటే తెలుగులో మేకర్స్ ఎలాంటి ప్రమోషన్లు జరుపలేదు. దానికి తోడు అప్పటికే విడుదలైన ‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేరు. కానీ మౌత్ టాక్ పాజిటీవ్‌గా రావడంతో ప్రేక్షకుల ఆదరణ దక్కింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థతో కలిసి శివ కార్తికేయన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు గమనిస్తే
నైజాం : 0.82 కోట్లు
సీడెడ్ : 0.27 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.29 కోట్లు
ఈస్ట్ : 0.10 కోట్లు
వెస్ట్ : 0.12 కోట్లు
కృష్ణా : 0.11 కోట్లు
గుంటూరు : 0.12 కోట్లు
నెల్లూరు : 0.13 కోట్లు
ఏపీ+తెలంగాణ : 1.96 కోట్లు
‘డాన్’ చిత్రానికి తెలుగులో రూ.1.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి రూ.1.96 కోట్ల షేర్‌ను సాధించింది. శివ కార్తికేయన్ తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈయన గత చిత్రం ‘డాక్టర్’ సినిమా కూడా 2 కోట్ల వరకు షేర్‌ను సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

