ముంబై : క్రేజీ కపుల్ సిద్ధార్ధ్ మల్హోత్ర (Sidharth Malhotra), కియారా అద్వానీ వంటింట చేసిన సందడి నెట్టింటకు పాకింది. కియారా అద్వానీ కోసం సిద్ధార్ధ్ ఇటీవల తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. కియారా కోసం నోరూరించే పిజాను తయారుచేశాడు. పిజా ఫొటోను కియారా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.
టెంప్టింగ్ పిజా తులిసి ఆకులు, బ్రకోలి, టొమాటోలు, క్యాప్సికంతో నోరూరించేలా ఉంది. కియారా ఈ పోస్ట్‌ను సిద్ధార్ధ్‌కు ట్యాగ్ చేస్తూ ఆదివారం బెస్ట్ చెఫ్‌తో..హెల్దీ పిజా ఎన్నడూ రుచిగా ఉండదంటూ చెఫ్ ఎమోజీతో ముగించారు. ఇక టేస్టీ, హెల్ధీ పిజా కోసం మీరు ప్రయత్నిస్తే వెజ్జీ ఫియస్టా పిజా, దేశీ తడ్కా చికెన్ పిజా, మెడిటేరియనియన్ మేజిక్ పిజా, హోల్ గ్రైన్ డిలైట్ వంటి పిజాలను ట్రై చేయవచ్చు.
Read More :