తమిళ నటుడు సిద్ధార్థ్, నాయిక అదితి రావ్ హైదరీ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వదంతులేనని అనుకోకుండా ఎప్పటికప్పుడు తాము సన్నిహితంగానే ఉన్నామనే సూచనలు చేస్తుంటారు. తెలుగులో ‘మహా సముద్రం’ అనే సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి వీరి మధ్య అనుబంధం మొదలైంది. అప్పటి నుంచి తరచూ కలిసి కెమెరాల కంట పడుతున్నారు. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి ఈ జంట కలిసి బయటకు రావడం అక్కడి మీడియాలో ప్రచురితమయ్యింది. అదితి పుట్టిన రోజున సిద్ధార్థ్ చేసిన పోస్ట్ వీరి ప్రేమను బలపరుస్తున్నది. అలాగే తన పుట్టినరోజున ప్రియుడితో కలిసి అదితి రహస్య టూర్ ప్లాన్ చేసుకుంది. తాజాగా ఇద్దరూ కలిసి ముంబై ఎయిర్ పోర్ట్‌లో కనిపించడం ఈ వార్తలకు ఊతమిస్తున్నది. బర్త్‌డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు అదితి సిద్ధార్థ్‌తో విహారానికి వెళ్లింది. ఇక సిద్ధార్థ్, అదితి వ్యక్తిగత విషయాలకు వస్తే…తన బాల్య స్నేహితురాలు మేఘనా నారాయణ్‌ను 2003 వివాహం చేసుకున్న సిద్ధార్థ్ 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి రావ్ హైదరీ నటుడు సత్యదీప్ను వివాహం చేసుకుని కొన్నేళ్లకు విడాకులు తీసుకుంది. ఆమె తెలుగులో ‘సమ్మోహనం’, ‘వీ’, ‘మహా సముద్రం’ వంటి చిత్రాల్లో నటించింది.