సనాతన ధర్మంలో దాగివున్న రహస్యాల ఆధారంగా రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’. శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రధారి. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక, శ్రీనివాస్ నిర్మాతలు. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రపంచమంతా చీకటిగా మారిన సమయంలో వెలుగులా ఉద్భవించిన శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. ఆధునిక సాంకేతికతతో, హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పవన్ చెన్న, సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, సమర్పణ: చాగంటి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ.