కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’.శ్రీని దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ లిరికల్ వీడియోను ఇటీవల చెన్నైలో విడుదల చేశారు. అర్జున్ జన్య సంగీతాన్నందించిన ఈ పాట ైస్టెలిష్ విజువల్స్‌తో ఆకట్టుకుంది.
‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. శివరాజ్‌కుమార్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. అనుపమ్‌ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ, కథ, దర్శకత్వం: శ్రీని.