శివ కందూకూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శిశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. శ్రీచరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు.
శ్రీచరణ్ స్వరపరిచి స్వయంగా పాడిన ఈ పాట సంగీత ప్రియుల హృదయాలను హత్తుకునేలా ఉంది. పురుషోత్తం రాజ్, సురేశ్ బనిశెట్టి రాసిన ఈ లిరిక్స్ హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాయి. ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా ప్రధాన తారాగణం: రాశీ సింగ్, అరుణ్‌కుమార్, దేవిప్రసాద్, వర్షిణి సౌందర రాజన్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిస్, కెమెరా: గౌతమ్ జార్జ్, దర్శకత్వం: పురుషోత్తం రాజ్.