Priyanka: సిరికి క్యారెక్టర్ లేదన్న షణ్ముఖ్.. అడిగి మరీ ప్రపోజ్ చేయించుకుంటున్న ప్రియాంక

శుక్రవారం బడ్జెట్ టాస్క్‌లో బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి ‘పగల గొట్టిన వారిదే పండగ అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. లగ్జరీ బడ్జెట్ టాస్కులో భాగంగా పలు గేమ్స్ ఆడించాడు. అయితే షణ్ముఖ్.. ఆట మొదలవకముందే డ్రాప్ అవుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. కానీ తర్వాత మాత్రం ఆట ఆడక తప్పలేదు. యాపిల్స్‌తో టవర్ కట్టే టాస్కులో శ్వేత ప్రియాంకను ఓడించగా ఆమె పగలగొట్టిన కుండలో మటన్ వచ్చింది.
ఇక మిగతా గేమ్స్‌లో లోబో, రవి, కాజల్ గెలవగా వారు కుండలు పగలగొట్టి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక టాస్క్ సమయంలో షణ్ముఖ్.. సిరిని క్యారెక్టర్లేదని అనడంతో ఆమె అలకబూనింది. ‘నాకు క్యారెక్టర్ లేదు కదా.. అలాంటప్పుడు నాతో ఎందుకు స్నేహం చేస్తున్నారు.. చెయ్యొద్దు కదా’ అని చెప్పుకొచ్చింది. జోక్‌గా అన్నాడు అంటూ జెస్సీ ఆమె ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు.
‘నాకు కొన్ని మాటలు చాలా బాధగా అనిపిస్తాయి.. జోక్‌గా అంటే పర్లేదు కానీ.. వేరే వాళ్లతో కంపేర్ చేసి హేళన చేస్తుంటే బాధగా అనిపిస్తుంది’ అని తెగ బాధపడింది సిరి. ఆ సమయంలో వచ్చిన షణ్ముఖ్ కాసేపు సరదాగానే పులిహోర కలుపుకుంటూ కూర్చున్నారు. ఇంతలో ప్రియాంక వచ్చి.. జెస్సీతో నువ్ నాకు ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎలా చేస్తావ్ అని అడుగుతుంది.. నేను నీకు ప్రపోజ్ చేయను.. సిరికి మాత్రమే చేస్తా అని అంటాడు.
నన్ను సిరి అనుకొని చేయమని ప్రియాంక అడుగుతుంది. తాను సిరికే చేస్తానని అంటాడు.దీంతో షణ్ముఖ్ .. ‘నీకు సిరి ఏ యాంగిల్లో నచ్చింద్రా’ అని హేళన చేస్తాడు షణ్ముఖ్. అదే మాట నేను నిన్ను అడిగితే ఏం చేస్తావ్ అని అంటాడు జెస్సీ. ఇన్ డైరెక్ట్‌గా దీప్తి సునయన గురించి ప్రస్తావిస్తూ.. హైట్ , లుక్స్, ఫిగర్ కన్నా గుణం ఇంపార్టెంట్ అనడంతో సిరి మొహం మాడిపోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

