Game Changer | ఇంకా ఎన్ని రోజులు.. రాంచరణ్ గేమ్ ఛేంజర్ షూట్‌పై శంకర్ క్లారిటీ
Game Changer | టాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చాలా కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటుందని తెలిసిందే.
Game Changer | టాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా ఈ చిత్రం చాలా కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటుందని తెలిసిందే.
ఇంతకీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో.. కొత్త అప్డేట్స్ ఎప్పుడు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం శంకర్ కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా 10-15 రోజులు మాత్రమే మిగిలి ఉందని శంకర్ చెప్పాడు. ఇండియన్ 2 విడుదలవగానే వీలైనంత త్వరగా గేమ్ ఛేంజర్‌ను పూర్తి చేస్తానని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గేమ్‌ఛేంజర్‌లో రాంచరణ్ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.. కాగా తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read also :
Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Sunaina | యూట్యూబర్‌తో మరాఠీ భామ నిశ్చితార్థం.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

