షారుఖ్‌తో యాక్షన్ సినిమా
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కెరీర్లో గత ఏడాది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. అందులో పఠాన్, జవాన్ చిత్రాలు వేయి కోట్ల వసూళ్ల మైలురాయిని దాటడం విశేషం.
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కెరీర్లో గత ఏడాది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. అందులో పఠాన్, జవాన్ చిత్రాలు వేయి కోట్ల వసూళ్ల మైలురాయిని దాటడం విశేషం. ఈ నేపథ్యంలో షారుఖ్‌ఖాన్ తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఆయన మరో యాక్షన్ సినిమావైపే మొగ్గు చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కరణ్‌జోహార్ దర్శకత్వం వహించబోతున్నారని తెలిసింది. తన కెరీర్లో ఇప్పటివరకు కరణ్‌జోహార్ యాక్షన్ సినిమా చేయలేదు. దాంతో ఈ వార్త బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ చిత్రసీమలో షారుఖ్‌ఖాన్-కరణ్‌జోహార్‌ను సూపర్‌హిట్ కాంబినేషన్‌గా అభివర్ణిస్తారు. వారి కలయికలో కుచ్ కుచ్ హోతాహై, కభీ ఖుషీ కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, కభీ అల్విదా నా కెహ్నా..వంటి బ్లాక్‌బస్టర్స్ హిట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి మరో సినిమాకు సిద్ధమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, యాక్షన్ జోనర్లో సరికొత్త కథాంశాన్ని సిద్ధం చేయాలనే ఆలోచనలో కరణ్‌జోహార్ ఉన్నారని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

