టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. రుషివనంలోన అంటూ సాగే రెండో సాంగ్‌ను జనవరి 25న లాంఛ్ చేయనున్నారు. తెలుగుతోపాటు వివిధ భాషల్లో సాంగ్ విడుదల కానుంది.
పాటను ఏ టైంలో లాంఛ్ చేస్తారనేది రేపు క్లారిటీ రానుంది. ఇప్పటికే విడుదలైన మల్లిక మల్లిక పాటకు మంచి స్పందన వస్తోంది. శాకుంతలంలో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది శాకుంతలం. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
శాకుంతలం రెండో సాంగ్ అప్డేట్..
A melody you'd fall in love with!🤍🎶#Rushivanamlona/#RushimooniyonKa/#Ruhivanadalondu/#RishivanamAagum/#Risivanthane from Jan 25th.#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/EPpLXltf6h
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 23, 2023