Janhvi Kapoor: ఫుడ్ పాయిజనింగ్.. ఆస్పత్రిలో జాన్వీ కపూర్
Janhvi Kapoor: జాన్వీకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. ఆమె ప్రస్తుతం ముంబై ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. బోనీ కపూర్ ఈ విషయాన్ని చెప్పారు. మరికొన్ని రోజుల్లో జాన్వీ కపూర్ కోలుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
ముంబై: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) ముంబైలోని ఆస్పత్రిలో చేరింది. తీవ్రస్థాయిలో ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ద్రువీకరించారు. అయితే ప్రస్తుతం ఆమె కండీషన్ బాగానే ఉన్నట్లు ఆయన చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో జాన్వీ కోలుకోనున్నట్లు బోనీ కపూర్ వెల్లడించారు. ఆ తర్వాతే ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. గత వారం అంబానీ ఇంట పెళ్లికి జాన్వీ హాజరైన విషయం తెలిసిందే.ఆ వేడుకలో ఆమె ఫుల్ చిందేసింది.
ఉల్జా చిత్రంలో జాన్వీ నటిస్తోంది. ఆ ఫిల్మ్ ట్రైలర్‌ను ఈ వారమే రిలీజ్ చేశారు. విదేశాంగ శాఖలో డిప్యూటీ హై కమీషనర్‌గా చేసిన సుహానా భాటియా పాత్రను జాన్వీ పోషించనున్నది. మిస్టర్ అండ్ మిస్సెస్ మహి చిత్రంలో జాన్వీ నటించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

