Sunny Deol | తెలుగువాళ్లతో సన్నీడియోల్ హిందీ సినిమా
గత ఏడాది ‘గదర్ 2’తో 600కోట్ల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీడియోల్ కథానాయకుడిగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ హిందీ చిత్రం తెరకెక్కనుంది.
Sunny Deol | గత ఏడాది ‘గదర్ 2’తో 600కోట్ల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీడియోల్ కథానాయకుడిగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ప్రతిష్టాత్మక టాలీవుడ్ నిర్మాణసంస్థలు మైత్రీ మూవీమేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. పూర్తి కమర్షియల్ అంశాలతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుందని, ‘SDGM’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సన్నీడియోల్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో చూస్తారని గోపీచంద్ మలినేని చెబుతున్నారు.
ఈ రోజు హైదరాబాద్‌లో ప్రత్యేక అతిథులతో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, మాటలు: సౌరభ్ గుప్తా, సంగీతం: థమన్.ఎస్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, టి.జి.విశ్వప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

