Ma Oori Polimera 2 | నువ్వు సచ్చినవ్ అని ఊళ్లో అంతా నమ్ముతున్నరు.. సస్పెన్స్‌గా మా ఊరి పొలిమేర 2 రిలీజ్ ట్రైలర్
Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2). పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. సత్యం రాజేశ్ టీం రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.
Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2). డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సీక్వెల్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. సత్యం రాజేశ్ టీం రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.
ఇటీవలే హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఊర్ల అందరు మంచిగున్నార్ రా.. అని సత్యం రాజేశ్ గెటప్ శ్రీనును అడుగుతుంటే.. నువ్వు సచ్చినవ్ అని ఊళ్లో అంతా నమ్ముతున్నారు. నీ పెళ్లాం నువ్ బతికున్నావనే నిజాన్ని మోయాలో.. దాయాలో తెలియక రోజూ చస్తూ బతుకుతుంది.. రా అని అంటున్నాడు. పొలిమేర 1లో చేతబడి చేసే సన్నివేశాలతో అందరికీ గూస్బంప్స్ తెప్పించిన సత్యం రాజేశ్.. ఆ సస్పెన్స్, థ్రిల్‌ను పొలిమేర 2లో కూడా కంటిన్యూ చేయబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు.
మా ఊరి పొలిమేర 2లో గెటప్ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి, రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే లాంఛ్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. రిలీజ్‌కు ముందే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్‌గా మా ఊరి పొలిమేర 2 అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చుట్టూ తిరిగే డబుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సీక్వెల్ ఉండబోతున్నట్టు టీజర్, ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు.
రిలీజ్ ట్రైలర్..
#Polimera2 Release Trailer OUT NOWhttps://t.co/58N1bFissN
BOOK YOUR TICKETS 👇🏻https://t.co/5pV3UEEaSU#Polimera2OnNov3rd @connect2vamsi @Satyamrajesh2 @DrAnilViswanath #KamakshiBhaskarla @GowrKriesna pic.twitter.com/uOQ0VQ3VgM
— Suresh PRO (@SureshPRO_) November 1, 2023
మా ఊరి పొలిమేర 2 ట్రైలర్..
మా ఊరి పొలిమేర 2 టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

