Ma Oori Polimera 2 | నిన్న థియేటర్లలో.. నేడు ఓటీటీలో.. మా ఊరి పొలిమేర 2 హవా
Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2). నవంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చాయి. మరోవైపు డిసెంబర్ 7నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది
Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2). హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేశాడు. నవంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చాయి. మరోవైపు డిసెంబర్ 7నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ తన రేంజ్ ఏంటో చూపిస్తోంది.
కేవలం 5 రోజుల్లోనే మా ఊరి పొలిమేర 2 ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ (నిమిషాలు) నమోదై.. ఇంప్రెసివ్ ఫీట్‌ను క్రియేట్ చేసింది. ఓ వైపు థియేటర్లలో.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫాంలో తగ్గేదే లే అంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఊర్ల అందరు మంచిగున్నార్ రా.. అని సత్యం రాజేశ్ గెటప్ శ్రీనును అడుగుతుంటే.. నువ్వు సచ్చినవ్ అని ఊళ్లో అంతా నమ్ముతున్నారు. నీ పెళ్లాం నువ్ బతికున్నావనే నిజాన్ని మోయాలో.. దాయాలో తెలియక రోజూ చస్తూ బతుకుతుంది.. రా అని అంటున్నాడు. పొలిమేర 1లో చేతబడి చేసే సన్నివేశాలతో అందరికీ గూస్బంప్స్ తెప్పించిన సత్యం రాజేశ్.. ఆ సస్పెన్స్, థ్రిల్‌ను పొలిమేర 2లో కూడా కంటిన్యూ చేస్తూ.. ట్రైలర్‌తోనే సీక్వెల్‌పై మరింత అంచనాలు పెంచేశాడు.
మా ఊరి పొలిమేర 2లో గెటప్ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి, రవివర్మ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్‌కు ముందే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్‌గా మా ఊరి పొలిమేర 2 అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుందని తెలిసిందే.పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చుట్టూ తిరిగే డబుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు.

Ma Oori Polimera 2
రిలీజ్ ట్రైలర్..
#Polimera2 Release Trailer OUT NOWhttps://t.co/58N1bFissN
BOOK YOUR TICKETS 👇🏻https://t.co/5pV3UEEaSU#Polimera2OnNov3rd @connect2vamsi @Satyamrajesh2 @DrAnilViswanath #KamakshiBhaskarla @GowrKriesna pic.twitter.com/uOQ0VQ3VgM
— Suresh PRO (@SureshPRO_) November 1, 2023
మా ఊరి పొలిమేర 2 ట్రైలర్..
మా ఊరి పొలిమేర 2 టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

