Sathi Leelavathi | మే 8న థియేటర్లలోకి ‘సతీ లీలావతి’.. సమ్మర్ బరిలో మెగా కోడలు!
Sathi Leelavathi | మెగా కోడలు, టాలీవుడ్ అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
Sathi Leelavathi | మెగా కోడలు, టాలీవుడ్ అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ‘శాకుంతలం’ చిత్రంతో గుర్తింపు పొందిన దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించగా.. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న ఈ సినిమాను మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కొత్త తేదీ ఖరారైనా, మాలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. మే 8న థియేటర్లలో కలుద్దాం అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఇది ఒక పూర్తిస్థాయి వినోదాత్మక ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే చిన్నపాటి మనస్పర్థలు, అనుబంధాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగనుంది. ముఖ్యంగా ఇందులో లావణ్య తన భర్తను తన కంట్రోల్లో ఉంచుకునే ఒక శక్తివంతమైన గృహిణి పాత్రలో కనిపించి మెప్పించబోతున్నారు. సీనియర్ నటుడు నరేష్, కామెడీ స్టార్ సప్తగిరి, వీటీవీ గణేష్ మరియు మోట్టా రాజేంద్రన్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు అదనపు బలం. వీరి మధ్య సాగే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనుందని సమాచారం. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘U’ సర్టిఫికేట్ దక్కించుకుంది.
New date. Same excitement. ♥️
Catch #SathiLeelavati in cinemas near you on May 8th! 😎🔥Get ready for the magic on the big screen. 🎥🍿 @ActorDevMohan @SatyaTatineni @ddp_offl #NaagaMohan @AnandiArtsOffl @ItsActorNaresh @MeSapthagiri @MickeyJMeyer @JafferJiky #BinendraMenon… pic.twitter.com/9JRa4MvI7I
— Lavanya konidela tripathi (@Itslavanya) April 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

