అన్స్టాపబుల్ వినోదం
విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘అన్స్టాపబుల్'. డైమండ్ రత్నబాబు దర్శకుడు. రజిత్ రావు నిర్మిస్తున్నారు. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. ఈ నెల 9న విడుదలకానుంది. శనివారం జరిగిన ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘అన్స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. రజిత్ రావు నిర్మిస్తున్నారు. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. ఈ నెల 9న విడుదలకానుంది. శనివారం జరిగిన ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రత్నబాబు మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. యాభై మంది నటీనటులతో ఈ సినిమా చేయడం గొప్ప విషయం. అన్స్టాపబుల్ వినోదంతో ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ సినిమాకు బ్రహ్మానందంగారి ఆశీస్సులు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని, ఆద్యంతం చక్కటి వినోదంతో ఈ చిత్రం అలరిస్తుందని సప్తగిరి చెప్పారు. భీమ్స్ అద్భుతమైన సంగీతాన్నందించారని, రెండున్నర గంటల పాటు నవ్విస్తుందని దర్శకుడు తెలిపారు. రోజువారి ఒత్తిళ్లకు ఈ సినిమా ఓ ఔషదంలా పనిచేస్తుందని నిర్మాత రజిత్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

