VD18 Movie | హిందీ నటుడు వరుణ్ ధావన్‌కు ‘భేదియా’ సినిమాతో టాలీవుడ్లో మంచి క్రేజే వచ్చింది. ఆహో ఓహో అనే రేంజ్లో ఈ సినిమా ఇక్కడ ఆడలేదు కానీ.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్ఫార్మ్ చేసింది. ఇటీవలే ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం వరుణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ తెగ బిజీగా గడుపుతున్నాడు. ఇక వరుణ్ నటిస్తున్న సినిమాలో తేరీ రీమేక్ ఒకటి. అట్లీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు మురడ్ కేతాని దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
కాగా తాజాగా ఈ సినిమా కాస్ట్లో సాన్య మల్హోత్రా జాయిన్ అయింది. ఇటీవలే అట్లీ దర్శకత్వం వహించిన జవాన్‌లో సాన్య ఓ కీలక రోల్ ప్లే చేసింది. ఆమె నటన నచ్చి అట్లీనే మరోసారి చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా.. అందులో కీర్తి సురేష్ మరొకరు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఒరిజనల్ వెర్షన్ తేరి.. తెలుగులో పోలీసుడుగా డబ్ అయింది. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్, పవన్‌తో చేయబోయే ఉస్తాద్ భగత్‌సింగ్ కూడా ఇదే స్టోరీ లైన్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.