అదే మంచి శకునం అనుకున్నా!
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకొని ప్రయాణం చేస్తున్నారు యువ హీరో సంతోష్ శోభన్. ఆయన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం హీరో సంతోష్‌శోభన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకొని ప్రయాణం చేస్తున్నారు యువ హీరో సంతోష్ శోభన్. ఆయన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం హీరో సంతోష్‌శోభన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నేను రిషి అనే యువకుడి పాత్రలో కనిపిస్తా. నవ్వుతూ జీవితాన్ని గడుపుతూ అందరిని నవ్వించాలన్నదే అతని లక్ష్యం. ఉమ్మడి కుటుంబంలో రిషి జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. గత చిత్రాల్లో నేను ఎక్కువగా సీరియస్ రోల్స్ చేశాను. కానీ ఈ సినిమాలో మాత్రం వాటికి పూర్తి భిన్నంగా నా పాత్ర వినోదాత్మకంగా సాగుతుంది. నందిని రెడ్డి సినిమాలను నేను బాగా ఇష్టపడతాను. ఆమె నుంచి సినిమా ఆఫర్ రాగానే వెంటనే అంగీకరించా. ఈ సినిమా టైటిల్ చూస్తేనే నిజాయితీగా చేసిన ప్రయత్నం అనిపిస్తుంది. ఇటీవల ఈ సినిమాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా చూశా. బయటకు వచ్చాక మనసంతా హాయిగా అనిపించింది. ఈ సినిమా విజయానికి అదే శుభశకునమని భావించా.
మూడు తరాల నటులతో..
ఈ సినిమాలో మూడు తరాల నటీనటులు కనిపిస్తారు. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. ‘తొలి ప్రేమ’ చిత్రంలో నటి వాసుకిని చూసిన చాలా మంది తమకు అలాంటి చెల్లెలు ఉంటే బాగుండేదనుకున్నారు. ఈ సినిమాలో తను నా అక్కయ్య పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత అలాంటి అక్క ఉంటే బాగుంటుందనే భావన కలుగుతుంది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ అన్నీ తానై నన్ను చూసుకుంది. ఆమె ప్రేమకు వెలకట్టలేను. కెరీర్‌పరంగా అమ్మ ఇచ్చిన ధైర్యం మరచిపోలేనిది. మాకు సొంత ఇల్లు లేదు. అమ్మకు ఓ మంచి ఇల్లును బహుమతిగా అందించాలనుకుంటున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

