Rules Ranjan Movie | సోషల్ మీడియాను ఊపేసిన సమ్మోహనుడా వీడియో సాంగ్ వచ్చేసింది..!
Rules Ranjan Movie | రూల్స్ రంజన్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అందులో సమ్మోహనుడా అనే సాంగ్ సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు. ఒక్క పాటతో అసలెలాంటి అంచనాల్లేని రూల్స్ రంజన్ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి.
Rules Ranjan Movie | రూల్స్ రంజన్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అందులో సమ్మోహనుడా అనే సాంగ్ సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు. ఒక్క పాటతో అసలెలాంటి అంచనాల్లేని రూల్స్ రంజన్ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి. మరీ ముఖ్యంగా నేహా శెట్టి అందాల వర్షంలో తడిసి ముద్దయిపోయారు. లిరికల్ సాంగ్‌ను రిపీటెడ్‌గా విన్న శ్రోతలెందరో. ఇక ఇన్‌స్టా రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాట మార్మోగిపోయింది. కాగా తాజాగా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది. పాటలో నేహాశెట్టి పరువాల విందు యూత్‌ను చూపు తిప్పుకోనీకుండా చేస్తుంది.
రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఏం రత్నం నిర్మించాడు. టీజర్, ట్రైలర్లు గట్రా రిలీజ్‌కు ముందు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తీరా రిలీజయ్యాక రోటీన్ స్టోరీ, జబర్దస్త్ కామెడీ ఉండటంతో జానాలు ఈ సినిమాను తిప్పికొట్టారు. తిరుపతికి చెందిన మధ్యతరగతి కుర్రాడు మనో రంజన్. చదువులో యావరేజ్ అయినా కష్టపడి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదిస్తాడు. దాని కోసం ముంబయికి మకాం మారుస్తాడు. అయితే అక్కడ హిందీ రాకపోవడంతో ఆఫీస్‌లో నవ్వులపాలవుతాడు.ఈ సమస్యకు అలెక్సాతో చెక్ పెడతాడు.
ఇక ఆ కంపెనీ బాస్‌ను మెప్పించి టీమ్ లీడర్‌గా కొనసాగుతాడు. అప్పడే తన సహ ఉద్యోగులంతా కిరణ్ చెప్పిన రూల్స్ ఫాలో అయ్యేలా కట్టుదిట్టం చేస్తాడు. దాంతతో అక్కడి ఉద్యోగులంతా కిరణ్‌ను రూల్స్ రంజన్ అని పిలవడం మొదలు పెడతారు. అదే టైమ్‌లో తను కాలేజీ డేస్‌లో ప్రేమించిన నేహాశెట్టి మళ్లీ తన జీవితంలోకి వస్తుంది. కాలేజ్ డేస్‌లో చెప్పలేని ప్రేమ విషయాన్ని నేహాశెట్టికి చెప్పి నేహాశెట్టిన ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత మళ్లీ ఆమె దూరమవడంతో తనని వెతుక్కుంటూ కిరణ్ తిరుపతికి వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

