సమంత మహానటి స్థాయికి వెళ్లగలదన్న సురేశ్‌బాబు.. నటి స్పందన ఏంటంటే..?
Unstoppable -2 | సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌కు బాలకృష్ణ పలు ప్రశ్నలు వేశారు. ‘ఈ జనరేషన్ హీరోయిన్లలో మహానటి స్థాయికి వెళ్లగలిగే తార ఎవరని మీరు అనుకుంటున్నారు..?’ అని అడగ్గా.. ‘సమంత’ అని ఇద్దరూ సమాధానమిస్తారు. ‘ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అవ్వగలిగితే ఆ అమ్మాయి (సమంత) ఒక్కటే ఆ స్థాయికి వెళ్లగలదు’ అంటూ సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు. కాగా, సురేశ్‌బాబు కామెంట్‌పై తాజాగా సమంత స్పందించింది. వీడియో క్లిప్‌ను రీట్వీట్ చేస్తూ.. లవ్ సింబల్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Unstoppable -2 | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ డబుల్ సందడితో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికీ రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. ఈ షోలో సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
కాగా, లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో త్వరలో కొత్త ఎపిసోడ్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా ఆహీ టీం ఇప్పటికే విడుదల చేసింది. అయితే షోలో భాగంగా సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌కు బాలకృష్ణ పలు ప్రశ్నలు వేశారు. ‘ఈ జనరేషన్ హీరోయిన్లలో మహానటి స్థాయికి వెళ్లగలిగే తార ఎవరని మీరు అనుకుంటున్నారు..?’ అని అడగ్గా.. ‘సమంత’ అని ఇద్దరూ సమాధానమిస్తారు.
‘ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అవ్వగలిగితే ఆ అమ్మాయి (సమంత) ఒక్కటే ఆ స్థాయికి వెళ్లగలదు’ అంటూ సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు. కాగా, సురేశ్‌బాబు కామెంట్‌పై తాజాగా సమంత స్పందించింది. వీడియో క్లిప్‌ను రీట్వీట్ చేస్తూ.. లవ్ సింబల్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/Samanthaprabhu2/status/1598893749584953344?s=20&t=8QbtaFOO0mG08PNsRGPGqQ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

