Maa Inti Bangaram Trailer | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈమెను యాన్నో చూసినట్టున్నాదే నీ పేరేమి అని ఓ వ్యక్తి అడుగుతుంటే సమంత అమాయకంగా నడుచుకుంటూ వస్తున్న సీన్‌తో మొదలైంది ట్రైలర్. నీది ఏ ఊరు అని అడిగితే.. నేనెవరో నీకు తెలుసా.? అసలు నేనెవరో నీకు తెలుసా.? అంటూ సీరియస్‌గా అడుగుతోంది సమంత. ఒక కోడలుకు ఎన్ని లక్షణాలుండాలి.. ఉత్తమ మహిళలాగా. అందంగా ఉండాలి.. సౌమ్యంగా ఉండాలి.. పద్దతిగా ఉండాలి. వంట చేయాలని పాట పాడాలి..అని నాకిమేవి రావే అంటోంది. ఒక్కటైతే నాకుందండి.. నా ప్రాణం అడ్డుపెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకోవాలి అని సమంత చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఓ వైపు గృహిణిగా, మరోవైపు వీరవనితలాగే ఉగ్రరూపం చూపిస్తూ సాగుతున్న ట్రైలర్ సినిమాలో సామ్‌ను సరికొత్తగా చూపించబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది. పెళ్లి అయిన అనంతరం పల్లెటూరికి కోడలిగా వెళ్లిన సమంతకి అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి.. తన గతం ఏంటి అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సమంత భర్త రాజ్ నిడిమోర్ ఈ కథను రాయగా.. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ (Tralala Pictures) దీనిని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
‘మా ఇంటి బంగారం’ ట్రైలర్
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు