Samantha | ‘మా ఇంటి బంగారం 2’లో సమంత ఉండదా .. సాయిపల్లవి ఎంట్రీపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ!
Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్టైన్మెంట్, సమంత నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్టైన్మెంట్, సమంత నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.సినిమా విజయోత్సవ వేడుకలో నిర్మాత రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’కు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన ఓ కథా లైన్ కూడా సిద్ధమైందని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు.
దీంతో ‘మా ఇంటి బంగారం 2’ ఎలా ఉండబోతోందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగాన్ని మరింత పెద్ద స్థాయిలో, ఎక్కువ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో రూపొందించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా సీక్వెల్‌గా వస్తుందా? లేక కథను వెనక్కి తీసుకెళ్లే ప్రీక్వెల్‌గా రూపొందిస్తారా? అనే అంశంపై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సమంత పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఆధారంగా కథను విస్తరించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆమె ప్రస్తుతం కొంత విరామం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం 2’లో ఆమె నటిస్తారా లేదా అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో లీడ్ రోల్ కోసం మొదట సాయిపల్లవినే పరిశీలించినట్లు నిర్మాత రాజ్ నిడిమోరు గతంలో వెల్లడించారు. అప్పట్లో సాయిపల్లవి ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో చివరికి సమంతను ఒప్పించి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు ‘మా ఇంటి బంగారం 2’లో సాయిపల్లవి నటించే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహజమైన నటన, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఈ తరహా పాత్రలకు బాగా సరిపోతారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.అయితే ప్రస్తుతం ఇవన్నీ కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలే. రెండో భాగంలో సమంతనే కొనసాగిస్తారా? లేదా కొత్త పాత్రతో సాయిపల్లవిని తీసుకువస్తారా? అనే విషయాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

