Samantha | ప్రెగ్నెన్సీలోనూ ఫుల్ బిజీగా సమంత.. కొత్త టాక్ షోతో ఓటీటీలో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్?
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో 2026 సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా మారింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వరుస సంతోషాలను ఆస్వాదిస్తున్న ఆమె ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, ఈ ఏడాది విడుదలైన 'మా ఇంటి బంగారం' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో 2026 సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా మారింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వరుస సంతోషాలను ఆస్వాదిస్తున్న ఆమె ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, ఈ ఏడాది విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో ఆమె గర్భవతి అనే శుభవార్త కూడా అభిమానులతో పంచుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగా సమంత కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారని అభిమానులు భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆమె మరో కొత్త ప్రాజెక్ట్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సమంత మరోసారి హోస్ట్‌గా మారనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రముఖ ఓటీటీ వేదిక కోసం చేసిన ‘సామ్ జామ్’ టాక్ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినీ ప్రముఖులతో సమంత జరిపిన ఆసక్తికర సంభాషణలు ఆ షోకు మంచి ఆదరణ తీసుకొచ్చాయి. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ తమిళ్ కోసం సమంత ఓ ప్రత్యేక టాక్ షో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోనీలివ్ తమిళ్ తమ సోషల్ మీడియా ఖాతాలో “సమంతతో కలిసి ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అంటూ చేసిన పోస్ట్‌ను సమంత కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
ఈ టాక్ షో ప్రధానంగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందనున్నట్లు సమాచారం. ఇందులో సమంత తమిళంతో పాటు ఇంగ్లీష్‌లో కూడా సెలబ్రిటీలతో సరదాగా ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె హోస్టింగ్ స్టైల్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉండటంతో, ఈ కొత్త షోపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సమంత గర్భవతిగా ఉండటంతో భారీ యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లు లేదా దీర్ఘకాలిక షూటింగ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శారీరక శ్రమ అవసరం లేని టాక్ షో చేయడం ఆమెకు అనుకూలంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టాక్ షో ఫార్మాట్లో ఎక్కువగా కూర్చుని సంభాషణలు సాగుతాయి కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ తరహా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే ఈ టాక్ షో ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

