Samantha | డూప్ లేకుండానే సమంత యాక్షన్ సన్నివేశాలు..‘మా ఇంటి బంగారం’ కోసం సామ్ అంత రిస్క్ చేసిందా?
Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల కలయికగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సమంత ఈ చిత్రంలో గతంలో ఎప్పుడూ కనిపించని శక్తివంతమైన పాత్రలో నటించినట్లు చిత్రబృందం చెబుతోంది.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల కలయికగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సమంత ఈ చిత్రంలో గతంలో ఎప్పుడూ కనిపించని శక్తివంతమైన పాత్రలో నటించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఒక యాక్షన్ నేపథ్యం ఉన్న మహిళ సంప్రదాయ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని సమాచారం. కుటుంబ కథాంశంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.
ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన నటి రచన, సమంత అంకితభావంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ, “ఈ సినిమాలో సమంత దాదాపు అన్ని యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండానే చేసింది. ఫైట్ మాస్టర్లు సూచించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ఎలాంటి సందేహం లేకుండా సన్నివేశాల్లో పాల్గొనేది. కొన్ని షాట్లు చూస్తేనే చాలా రిస్కీగా అనిపించేవి. అయినప్పటికీ సమంత ఎంతో ధైర్యంగా వాటిని పూర్తి చేసింది” అని తెలిపింది. సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని రచన పేర్కొంది. “తెరపై ఆ సన్నివేశాలు చూసినప్పుడు సమంత ఎంత కష్టపడిందో అందరికీ అర్థమవుతుంది. ఆమె చూపించిన కమిట్మెంట్ నిజంగా అభినందనీయం” అని చెప్పుకొచ్చింది.
సమంత గతంలో కూడా తన పాత్రల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని కఠినమైన సన్నివేశాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ‘మా ఇంటి బంగారం’లో యాక్షన్‌కు మరింత ప్రాధాన్యం ఉండటంతో, ఈ సినిమాలో ఆమె ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా రచన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మరి సమంత స్వయంగా చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో తెలుసుకోవాలంటే జూన్ 19 వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

