Samantha | సమంత బర్త్ డే .. రాజ్ సెలబ్రేషన్ పిక్స్ వైరల్
Samantha | సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే స్టార్ హీరోయిన్ సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఏప్రిల్ 28న ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఆమె కు సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే 2023 లోనే సిటాడెల్ సిరీస్ షూటింగ్ సమయంలో సమంత భర్త రాజ్ నిడిమోరు ఆమె పుట్టిన రోజుని అర్ధరాత్రి ఘనంగా సెలబ్రేట్ చేయగా, ఈ పిక్స్ సమంత అప్పట్లో అధికారికంగానే పోస్ట్ చేసింది.
Samantha | సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే స్టార్ హీరోయిన్ సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఏప్రిల్ 28న ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఆమె కు సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే 2023 లోనే సిటాడెల్ సిరీస్ షూటింగ్ సమయంలో సమంత భర్త రాజ్ నిడిమోరు ఆమె పుట్టిన రోజుని అర్ధరాత్రి ఘనంగా సెలబ్రేట్ చేయగా, ఈ పిక్స్ సమంత అప్పట్లో అధికారికంగానే పోస్ట్ చేసింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని రూమర్స్ రాగా ఈ ఫొటోలు మరింత బలం చేకూర్చాయి. ఎట్టకేలకి 2025 డిసెంబర్ లో రాజ్ – సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పెళ్లి తర్వాత వచ్చిన సమంత మొదటి పుట్టిన రోజు కావడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
మరో వైపుఏ బర్త్‌డేకు రెండు రోజుల ముందు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.‘బర్త్‌డే వీక్’ అంటూ సమంత తన జీవితంలో గత ఏడాది జరిగిన మార్పులను సూచిస్తూ కొన్ని ఫోటోలు పంచుకున్నారు. వాటికి జోడించిన వ్యాఖ్యలు అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి. తనతో ఉన్నది ఏమిటి? వదిలేసింది ఏమిటి? జీవిత ప్రయాణంలో పోయినవి, మిగిలినవి ఏవో ఆమె చాలా సూటిగా వెల్లడించారు.తన ప్రయాణం ప్రారంభం గురించి చెబుతూ… పని మీద ప్రేమ, ముందుకు నడిపించే ఆత్మవిశ్వాసమే ఇప్పటికీ తన బలం అని సమంత పేర్కొన్నారు. అయితే ఎప్పుడూ ఇతరుల ఎంపిక కోసం ఎదురుచూసే స్వభావాన్ని మాత్రం వదిలేశానని తెలిపారు.
జీవితంలో ప్రతీది ప్లాన్ ప్రకారం జరగకపోయినా, తన మనసు చెప్పేది వినే తీరు మారలేదని చెప్పారు. కానీ తనను నియంత్రించాలనే ఆలోచనను మాత్రం విడిచిపెట్టినట్లు వెల్లడించారు. ప్రతిదీ మారినా నా సంకల్పం మారలేదు అని సమంత చెప్పడం గమనార్హం. తాను ఎలా ఉండాలని అనుకున్నానో ఆ భావనను కూడా ఇప్పుడు వదిలేశానని చెప్పడం ద్వారా, గతంలో జరిగిన వ్యక్తిగత పరిణామాలను సూచించినట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం తన జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉందని, తొందరపడే స్వభావాన్ని కూడా వదిలేశానని సమంత చెప్పారు. ప్రతి ఫోటో వెనుక ఒక లోతైన భావం దాగి ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

