Samantha | రెండో పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. అభిమానులతో ఘనంగా జరుపుకున్న సమంత, ఫొటోలు వైరల్
Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన పుట్టినరోజును ఈసారి ఎంతో ప్రత్యేకంగా, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా రెండో వివాహం తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. చాలా కాలం తర్వాత సమంత తన అభిమానులతో నేరుగా కలుసుకోవడం విశేషం.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన పుట్టినరోజును ఈసారి ఎంతో ప్రత్యేకంగా, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా రెండో వివాహం తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. చాలా కాలం తర్వాత సమంత తన అభిమానులతో నేరుగా కలుసుకోవడం విశేషం. ఫ్యాన్స్ సమక్షంలో కేక్ కట్ చేస్తూ, వారితో ముచ్చటిస్తూ గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సమంత చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, అభిమానులతో ఫోటోలు దిగుతూ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
సమంత కెరీర్ పరంగా కూడా కీలక దశలో ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, ఆమె తన ప్రొఫెషనల్ ప్రయాణాన్ని బ్యాలెన్స్డ్గా కొనసాగిస్తున్నారు. అభిమానులతో ఇలాంటి వేడుక జరుపుకోవడం ఆమెకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని తెలుస్తోంది.ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. “స్టే స్ట్రాంగ్”, “హ్యాపీ బర్త్డే క్వీన్”, “మరిన్ని విజయాలు సాధించాలి” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సమంత ఈసారి తన పుట్టినరోజును మరింత భావోద్వేగంగా, అభిమానులతో కలిసి జరుపుకోవడం ఒక మధురమైన మైలురాయిగా నిలిచింది. త్వరలో సమంత మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిర్మాతగా వ్యవహరించారు. సమంత మూవీ ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

