Samantha | స్నేహితుల సర్ప్రైజ్తో సమంత సీమంతం.. కుటుంబ వేడుకలో ఎమోషనల్ మూమెంట్స్ వైరల్!
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఓ సన్నిహిత కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకకు వెళ్లిన ఈ జంటకు అక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సమంత గర్భిణిగా ఉండటంతో ఎలాంటి హడావిడి లేకుండా అక్కడే చిన్నపాటి సీమంతం వేడుక నిర్వహించారు.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఓ సన్నిహిత కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకకు వెళ్లిన ఈ జంటకు అక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సమంత గర్భిణిగా ఉండటంతో ఎలాంటి హడావిడి లేకుండా అక్కడే చిన్నపాటి సీమంతం వేడుక నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో సమంతకు కొత్త దుస్తులు అందించి, స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. ఈ సర్ప్రైజ్ను అస్సలు ఊహించని సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అయి స్నేహితుల ప్రేమాభిమానాలకు ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజ్ నిడిమోరు కూడా ఈ ప్రత్యేక క్షణాలను ఎంతో ఆస్వాదించినట్లు సమాచారం.
ఈ వేడుకలో సమంత, రాజ్ నిడిమోరు ఒకే రంగు మెరూన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సమంత, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గడిపిన ఆప్యాయ క్షణాలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమంత జీవితంలో ఇది మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులుగా సమంత గర్భధారణపై వార్తలు వినిపిస్తుండగా, ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ కార్యక్రమంలో ఆమె బేబీ బంప్‌తో కనిపించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లకు విరామం ఇచ్చి కుటుంబంతో కలిసి ఈ ప్రత్యేక సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది.
నటిగా వరుస విజయాలతో కెరీర్లో కొత్త అధ్యాయం ప్రారంభించిన సమంతకు, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ఆనందం చేరువైంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగిన ఈ సీమంతం వేడుక ఆమె జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిపోనుంది. అభిమానులు కూడా తల్లి కాబోతున్న సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

