Sam Bahadur | దేశభక్తి ఉప్పొంగేలా ‘బడ్తే ఛలో’.. ‘సామ్ బహదూర్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
Vicky Kaushal | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సామ్ బహదూర్’ (Sam Bahadur). ఈ సినిమాకు మేఘనా గుల్జార్ (Meghana Gulzar) దర్శకత్వం వహిస్తుండగా.. రోనీస్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ఒక సర్దార్ ఉద్దమ్ వంటి బ్లక్ బస్టర్ సినిమా తర్వాత మరో బయోపిక్ సినిమాతో ముందుకువస్తున్నాడు విక్కీ.
Vicky Kaushal | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సామ్ బహదూర్’ (Sam Bahadur). ఈ సినిమాకు మేఘనా గుల్జార్ (Meghana Gulzar) దర్శకత్వం వహిస్తుండగా.. రోనీస్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ఒక సర్దార్ ఉద్దమ్ వంటి బ్లక్ బస్టర్ సినిమా తర్వాత మరో బయోపిక్ సినిమాతో ముందుకువస్తున్నాడు విక్కీ. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బడ్తే ఛలో అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ చూస్తే.. భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న విక్కీ (సామ్ బహదూర్) తమ సోల్జర్స్‌కు 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో దేశభక్తి స్ఫూర్తిని మేల్కొల్పుతున్నట్లు కనిపిస్తుంది. కాగా.. ఈ పాటను శంకర్ మహదేవన్, విశాల్ దద్లానీ దివ్య కుమార్ కలిసి పాడగా.. గుల్జార్ సాహిత్యం.. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించాడు. ఇక విడుదలైన తక్కువ సమయంలోనే ఈ పాట 2 లక్షల వ్యూస్ దక్కించుకుంది.
1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉండి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సామ్ మానెక్ షా(Sam Manek Shah) జీవితం ఆధారంగా ఈ మూవీ రానుంది. ఇక సామ్మానెక్షా పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా.. ఇందిరా గాంధీ పాత్రలో సనా ఫాతిమా షేక్ (Sana Fatima Sheikh) నటించింది. ఇక విక్కీ కౌశల్ భార్య పాత్రలో సన్యా మల్హోత్రా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

