Ae Watan Mere Watan | సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ వతన్ మేరే వతన్(Ae Watan Mere Watan). ఈ సినిమాకు కణ్ణన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను మొదట గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. ఇక తాజాగా మార్చి 21న ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ నుంచి ట్రైలర్ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. హిస్టరికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్నట్లు తెలుస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కమ్యూనిటి రేడియో స్టేషన్లు ఎక్కువ వాడకంలో ఉన్న విషయం తెలిసిందే. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే ఈ రేడియో స్టేషన్లు ఉపయోగించి ఉద్యమకారులకు సమాచారం అందించేవారు. అయితే ఇండిపెండెన్స్ సమయంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపిన ఓ మహిళ కథ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. రేడియో హోస్ట్ (Radio Host) ఉషా మెహతా జీవిత కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరల్డ్ రేడియో డే సందర్భంగా మార్చి 21 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.