Roja | తమిళ సినీ పరిశ్రమలో సీనియర్ నటీమణుల రీఎంట్రీ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల శోభన తిరిగి కోలీవుడ్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు మరో ఫైర్‌బ్రాండ్ నటి, రాజకీయ నాయకురాలు ఆర్కే రోజా కూడా మళ్లీ తమిళ సినిమాల్లో బిజీ అవుతున్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్న రోజా, ప్రస్తుతం సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టారు. 12 ఏళ్ల విరామం తర్వాత ఆమె తమిళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇప్పటికే ఆమె నటించిన లెనిన్ పాండ్యన్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇదే సమయంలో రోజా నటిస్తున్న మరో చిత్రం అన్బే డయానా కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్య రంగనాథన్ హీరోయిన్గా కనిపించనున్నారు. చెన్నైలోని పెరంబూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా కీలక పాత్రలో, ముఖ్యంగా హీరో తల్లి పాత్రలో కనిపించబోతున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘పెరంబూర్ గానా’ సాంగ్ మంచి స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా ఈ పాటలో రోజా చేసిన మాస్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చాలా గ్యాప్ తర్వాత కూడా తన ఎనర్జీ తగ్గలేదని మరోసారి నిరూపించారు. ఈ పాట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా లిరికల్ వీడియోలు విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
ఇటీవల సీనియర్ నటి రాధిక నటించిన ‘తాయి కిళవి’ భారీ విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు రోజా రీఎంట్రీ మూవీపై కూడా కోలీవుడ్‌లో మంచి బజ్ నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత రోజా మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రీఎంట్రీతో కోలీవుడ్‌లో రోజా మరోసారి తన సత్తా చాటుతారా అన్నది చూడాలి.