The 100 Movie | ‘ది 100’ అంటూ వస్తున్న మొగలిరేకులు హీరో.. ఇంట్రెస్టింగ్గా మోషన్ పోస్టర్
The 100 Movie | మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ (Rk Sagar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’(The 100 Movie). ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తుండగా.. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
The 100 Movie | మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ (Rk Sagar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’(The 100 Movie). ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తుండగా.. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మూవీ నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. సాగర్ విక్రాంత అనే ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాపై దర్శకుడు రాఘవ్ ఓంకార్ మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలిపాడు. విక్రాంత్ అనే ఐపీఎస్ పాత్రలో ఆర్కే సాగర్ ఇంప్రెస్ చేయనున్నాడు, ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అలాగే కమర్సియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమాకు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. గిరిధర్, ఆనంద్ (దొంగ దొంగ ఫేమ్), లక్ష్మీ గోపాల్ స్వామి (అరవింద సమేత ఫేమ్), కళ్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ (యాంకర్) తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘సిద్ధార్థ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రభాస్ ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’, ‘షాదీ ముబారక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ద 100’ (The 100 Movie).
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

